![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-8 లో తొలి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన యష్మీ ఈవారం ఎలిమినేషన్ అయ్యింది. నామినేషన్లో ఉన్నవారికంటే చాలా తక్కువ ఓట్లు రావడంతో యష్మీ బయటకొచ్చేసింది.
ఇక హౌస్ నుండి బయటకొచ్చాక యష్మీ బిగ్ బాస్ బజ్(Biggboss Buzz) లో పాల్గొంది. యష్మీ వచ్చి రాగానే యాంకర్ అంబటి అర్జున్ తనతో ప్రమాణ స్వీకారం చేపించాడు. అదేంటంటే... యష్మీ అనే నేను బిగ్ బాస్ బజ్ లో అంతఃకరణ శుద్ధితో అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేస్తున్నానని అంది. హౌస్ నుండి ఎందుకు బయటకొచ్చావని అనాలసిస్ ఏం అయిన చేసుకున్నావా అని యాంకర్ అడుగగా.. హౌస్ లో నా ఒపీనియన్స్ మారిపోతుంటాయి. చూసేవాళ్ళకి ఫ్లిప్పింగ్ లా కన్పిస్తుంది కానీ బయట నా ప్రాబ్లమ్ అదే అని యష్మీ అనుగగా.. బయట ఈ బిహేవియర్ ని ఉడుకుబోతుతనమని అంటారని యాంకర్ అన్నాడు. యష్మీ గ్రూప్ గేమ్ ఆడిందా? మీరందరూ కలిసి గ్రూప్ గా డిస్కస్ చేసుకొని నామినేట్ చేశారా? నిఖిల్ కి నీకు మధ్య ఏం ఉందని యాంకర్ అడుగగా.. నిఖిల్ మంచి ఫ్రెండ్ అని అంది. మరి గౌతమ్ షర్ట్ వేసుకొని నిఖిల్ కి జెలస్ ఫీల్ తెప్పించాలని ఎందుకు అనుకున్నారని యాంకర్ అడుగగా.. అది జరిగాక నేను స్మైల్ ఇస్తే నవ్వుతుంది.. సిగ్గుపడుతుంది.. ఏదీ ఫీలింగ్స్ ఉందని అనుకుంటారు కదా అని యష్మీ అంది. సోషల్ మీడియా లో మీ ఇద్దరి వల్ల షేక్ అయ్యిందని యాంకర్ అనగానే యష్మీ ఆశ్చర్యపోయింది.
యష్మీ ఎలిమినేషన్ అవ్వాలని బిబి ఆడియన్స్ ఎన్నో వారాల నుండి ఎదురుచూస్తున్నారు. ఇక తను బయటకొచ్చాక సంబరాలు చేసుకుంటున్నారు. ఇక హౌస్ లో యష్మీ జర్నీ ఎలా ఉందని, నిఖిల్ మీద తన అభిప్రాయమేంటో తెలియాలంటే బజ్ ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |